అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project Controversy | కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ (CR Patil) సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం వైఫల్యానికి ప్రణాళిక, రూపకల్పనలో ఉన్న తీవ్రమైన లోపాలే కారణమని పేర్కొన్నారరు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. బ్యారేజీ కుంగిపోవడంపై ప్రస్తుతం కేంద్ర కమిటీ విచారణ జరుపుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaleshwaram Project Controversy | పనులు చేయలేదు
గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రతిపాదనను కూడా సమర్పించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కింద భారీగా రూ.873 కోట్ల నిధులు చేతిలో ఉన్నప్పటికీ, కేవలం రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద తెలంగాణ నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలేవీ అందలేదని ఆయన వెల్లడించారు.
కాగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకే కుంగిపోయిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్ వేసింది. అనంతరం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి పాటిల్ కాళేశ్వరంలో భారీగా ప్రజాధనం వృథా అయిందని చెప్పడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
