Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత

తెలంగాణతాజా వార్తలు

Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష చేపడుతున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 2:09 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kalvakuntla Kavitha New Party

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kalvakuntla Kavitha New Party |తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష చేపడుతున్నారు.

Contents
  • Kalvakuntla Kavitha New Party | ప్రజల కోసం పోరాటం
    • Kalvakuntla Kavitha New Party | తెలంగాణ పార్టీ
      • Kalvakuntla Kavitha New Party | ప్రభుత్వం వెనక్కి తగ్గింది

సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్​ భవన్​ (Ambedkar Bhavan)లో ఆమె దీక్ష చేపట్టగా.. మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హైదరాబాద్​కు తరలించారు. దీంతో నగరంలోని జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.కల్వకుంట్ల కవిత మాట్లాడూతూ.. తాను బీఆర్​ఎస్​ (BRS)ను విడిచిపెట్టలేదన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం లేవనెత్తినందుకు వారు సస్పెండ్​ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మేము ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ప్రకటించారు. అది పూర్తిగా రాష్ట్రంపై దృష్టి పెడుతుందన్నారు. తెలంగాణ (Telangana)లో కొత్త పార్టీకి అవకాశం ఉందని పేర్కొన్నారు.

Kalvakuntla Kavitha New Party | ప్రజల కోసం పోరాటం

కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. కొత్తగా ప్రజలకు సమస్యలను తెచ్చి పెడుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్​ సైతం ప్రజా సమస్యలపై పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తమ తరపున మాట్లాడే, వారితో ఉండే సమూహం కోసం చూస్తున్నారని పేర్కొన్నారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha New Party | తెలంగాణ పార్టీ

BRS, కాంగ్రెస్, BJPతో సహా మన రాష్ట్రంలోని అన్ని పార్టీలు వాటి అసలు ఉద్దేశం నుండి వైదొలిగాయని కవిత అన్నారు. ఇక్కడి ప్రజలు మన సమస్యల గురించి, మన సంస్కృతి గురించి మాట్లాడే ప్రాంతీయ పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి పార్టీ లేదని తెలిపారు. త్వరలో ఏర్పడనున్న తమ పార్టీ, తెలంగాణ గుర్తింపు, హక్కుల కోసం పోరాడే తెలంగాణ పార్టీ అవుతుందన్నారు.

Kalvakuntla Kavitha New Party | ప్రభుత్వం వెనక్కి తగ్గింది

ఖమ్మం నగరంలో ఒకే రోజులో 750 మంది ఇళ్లను తొలగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో సగానికి పైగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. అయినా ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. బాధితుల తరఫున తాము నిరాహార దీక్ష చేశామన్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం ప్రారంభించిందన్నారు. కాగా ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి

Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
TAGGED:Ambedkar BhavanBRSIndiramma HouseKalvakuntla KavithaKalvakuntla Kavitha New PartyTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kadiyam Srihari Challenge Kadiyam Srihari Challenge | కేసీఆర్​ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి
Next Article KA Paul Iran Israel War KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?