Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

తాజా వార్తలుతెలంగాణ

Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

జోగులాంబ గద్వాల నుంచే తాను కొత్త పార్టీ ప్రారంభిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గద్వాలలో సోమవారం నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:25 సా.
admin
1 నెల ago
Share
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!
Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha New Party | జోగులాంబ గద్వాల నుంచే తాను కొత్త పార్టీ ప్రారంభిస్తానని (Kavitha New Party) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో సోమవారం నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కార్యక్రమమైనా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్​లో ప్రారంభమయ్యేదని గుర్తు చేశారు. కానీ.. తాను భవిష్యత్​లో ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఈ గడ్డపై నుంచి ఎలాంటి పని చేసినా జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కవిత అన్నారు.

Contents
  • Kavitha New Party | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ
    • బీఆర్​ఎస్​ మోసం..
      • బకాయిలు వెంటనే చెల్లించాలి

Kavitha New Party | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ

వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏం ఇచ్చినా.. తీసుకోవాలని సూచించారు. కానీ పని చేసే వారికి మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు మాత్రం జాగృతికే వేయాలని కోరారు. ప్రతి మండలంలో జెడ్పీటీసీలను బరిలో నిలబెడతామని కవిత తెలిపారు.

బీఆర్​ఎస్​ మోసం..

బీఆర్​ఎస్​ పార్టీ నడిగడ్డ ప్రాంతాన్ని మోసం చేసిందని కవిత విమర్శించారు. ఈ గడ్డకు నీళ్లు ఇవ్వడంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ విఫలమయ్యాయని మండిపడ్డారు. రాజకీయ శక్తిగా కొత్తగా వచ్చే (Kavitha New Party) తాము నడిగడ్డకు నీళ్లు తెస్తామన్నారు. ఈ ప్రాంతంలో తుంగభద్ర, కృష్ణ నదులు పారుతున్నా.. నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యేకు దమ్ముంటే.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

బకాయిలు వెంటనే చెల్లించాలి

ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం లేదని కవిత అన్నారు. మహిళా రైతులు ఓ వైపు ఇల్లు, మరోవైపు వ్యవసాయం చూసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటే.. దళారులు వారిని దగా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో సీడ్​ పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్​ పత్తి రైతుల బకాయిలను వారం రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం
Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్​
TAGGED:BRS PartyCongress TelanganaJogulamba GadwalKalvakuntla KavithaKrishna RiverMPTC Elections TelanganaTelangana JagruthiTelangana PoliticsTungabhadra RiverZPTC Elections Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Inter Exams 2026 Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Next Article Travel Advisory Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?