అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha Protest | ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిర్వాసితులకు Kalvakuntla Kavitha సంఘీభావం తెలిపారు. ఆమె సోమవారం బాధితులను కలిశారు. వారి సమస్యలను తెలుసుకొని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులతో కలిసి ఖమ్మంలోని జడ్పీ సెంటర్‌లోని B. R. Ambedkar విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా Telangana Jagruthi అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. వెలుగుమట్ల నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితుల పునరావాసం, హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Kalvakuntla Kavitha Protest | పోలీసుల జోక్యం..
కవితతో కలిసి Visharadan Maharaj నిరసనలో పాల్గొన్నారు. కాగా, అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం Section 41A CrPC కింద నోటీసులు ఇచ్చి, విడుదల చేశారు.
పోలీసుల చర్యలపై కవిత స్పందించారు. ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నిరవధిక నిరాహార దీక్ష
ఠాణా నుంచి బయటకు వచ్చిన అనంతరం సోమవారం రాత్రి కవిత ఖమ్మం పట్టణంలోని Ambedkar Bhavanకు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వెలుగుమట్ల నిర్వాసితులు పాల్గొన్నారు.

