Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి

నిజామాబాద్

Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి

కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుత ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి దొంగ ఓట్లతో గెలిచారని 38వార్డు ప్రత్యర్థి అభ్యర్థి రంగ మాధవి ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 2:49 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Kamareddy 38th Ward
Kamareddy 38th Ward

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy 38th Ward | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లోని 38వ వార్డులో దొంగ ఓట్లతోనే ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి, ప్రస్తుతం మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి గెలిచారని ప్రత్యర్థి అభ్యర్థి రంగ మాధవి ఆరోపించారు. ఈ మేరకు తన నివాసంలో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు.

Contents
  • Kamareddy 38th Ward | ముఖ్య నాయకుడి సోదరుడే కారణం..
    • Kamareddy 38th Ward | 50 దొంగ ఓట్లు..
      • Kamareddy 38th Ward | భార్యాభర్తల కంటతడి..

Kamareddy 38th Ward | ముఖ్య నాయకుడి సోదరుడే కారణం..

కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) తనకు టికెట్ కేటాయించిందని, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారన్నారు. అయితే తమ పార్టీ ముఖ్య నాయకుడి సోదరుడు అందరికి ఫోన్​చేసి పార్టీ టికెట్ ఇచ్చినా స్వతంత్ర అభ్యర్థే మన అభ్యర్థి అని వారికే ఓటు చేయాలని చెప్పారని ఆరోపించారు. ఛైర్మన్ ఉమారాణి స్వగ్రామం రాజంపేట (Rajampet) అని, ఆ గ్రామం నుంచి కొంతమందికి 38వ వార్డులో ఓటు హక్కు కల్పించారన్నారు. రాజంపేట ఉప సర్పంచ్​గా ఉన్న మీర్ ఇమ్రాన్​తో పాటు ఆ గ్రామానికి చెందిన 15 మంది, జంగంపల్లి గ్రామంలో (Jangampally Village) హిందీ పండిత్​గా పనిచేస్తున్న అబ్దుల్ గపూర్ దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అలాగే 40, 37, 39 ఇతర వార్డుల నుంచి 38వ వార్డులో ఓటు వేశారన్నారు.

Kamareddy 38th Ward | 50 దొంగ ఓట్లు..

తమ వార్డులో 5-8-11 నుంచి 5-8-18 నంబరు గల ఇళ్లపై 50 దొంగ ఓట్లు ఉన్నాయని, హిందువుల ఇళ్లపై ముస్లింల ఓట్లు చేర్చారని రంగ మాధవి అన్నారు. ఈ విషయమై జనవరి 8న మున్సిపల్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 250 డబుల్ ఓట్లు, 66 ఇతర వార్డుల ఓట్లు, 45 కమర్షియల్ షట్లర్లు, భవనాలపై ఉన్నాయన్నారు. కేటీఆర్ (KTR) వద్ద పర్సనల్ పీఏగా ఉన్న మాణిక్య మహేష్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి కజిన్ బ్రదర్ అని, దొంగ ఓట్ల వెనక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. దొంగ ఓట్లను పోలింగ్ రోజు తమ ఏజెంట్లు గుర్తించి అడ్డుకున్నారని, ఓటర్ ఐడీతో రావడంతో ఓటరు అతనే కదా అని అధికారులు పట్టించుకోలేదన్నారు.

Kamareddy 38th Ward | భార్యాభర్తల కంటతడి..

పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా గ్రూప్​ తగాదాలతో తాము అన్యాయానికి గురయ్యామని భార్యాభర్తలు కంటతడి పెట్టుకున్నారు. తమకు ఓట్లేసి సహకరించిన వారికి ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన ఇప్ప ఉమారాణి ఎన్నికను సవాల్ చేస్తూ రీపోలింగ్ చేయాలని కోర్టును ఆశ్రయించామన్నారు. కౌన్సిలర్​గా ఇప్ప ఉమారాణి ఎన్నికను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం

Sarpanch Upasarpanch Dispute | కుర్చీతో పేచీ.. ఉప సర్పంచ్​పై సర్పంచ్ ఫిర్యాదు
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్​
KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​
Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
TAGGED:Congress PartyJangampally VillageKamareddy 38th WardKamareddy MunicipalityKTR
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mulugu Irrigation Projects Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Next Article Konda Sushmitha Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?