అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy ACB raids | ప్రతిరోజు వందలాది మంది రాకపోకలతో నిత్యం కళకళలాడే కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Municipal Office) జనాలు లేక బోసిపోయింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏసిబి దాడుల తర్వాత ఒక్కసారిగా జన సంచారం తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Kamareddy ACB raids | జోరుగా చర్చ..
గతంలో పలు రకాల పనుల నిమిత్తం వందలాదిగా వచ్చే జనాలు ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది. జనాలతో పాటు ప్రస్తుత, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఎప్పుడు పడితే అప్పుడు కార్యాలయంలో తిష్ట వేసేవారు. అధికారుల ఛాంబర్లో కూర్చుని గంటల తరబడి ముచ్చట్లు పెట్టేవారు. ఏసీబీ (ACB) దాడుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.

Kamareddy ACB raids | ఆయా విభాగాల్లో..
టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో ఏసీబీ దాడులు చేపట్టడం, ఆ శాఖల్లో భారీగా అవినీతి జరిగిందని ఏసీఈబ గుర్తించడంతో నాయకులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్న చర్చ సాగుతోంది. అధికారులు ఏ సమాచారం తీసుకున్నారో.. ఏ రికార్డులు స్వాధీనం చేసుకున్నారో.. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయం అధికారులకు, నాయకులను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కార్యాలయంలో అధికారులు తప్ప రాజకీయ నాయకులెవరు కనిపించకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Oil Palm Industry | జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

