అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Chairperson Election | కౌన్సిలర్‌గా గెలిచి కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని చేపట్టిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Kamareddy Chairperson Election | మూడు ఓట్ల తేడాతో గెలుపు..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగ మాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారు. గత నెల 11 న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తేలింది. అనుమానం వచ్చి రీ కౌంటింగ్ చేసినా అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్ప ఉమారాణి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు.

Kamareddy Chairperson Election | రెండు పార్టీల మద్దతుతో..
కాగా, ఫిబ్రవరి 16 వ తేదీన అనూహ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణికి మద్దతు మద్దతు ప్రకటించగా ఏకగ్రీవంగా ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే కౌన్సిలర్‌గా గెలుపొందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ఓటమి చెందిన అభ్యర్థి రంగ మాధవి మంగళవారం కోర్టును ఆశ్రయించారు.
Kamareddy Chairperson Election | ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు..
ఈ విషయమై రంగ మాధవిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం నిజమేనన్నారు. వార్డులో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను చేర్చారని, కమర్షియల్ భవనాల్లో ఓటర్లను చేర్చారని, రాజంపేట లాంటి ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు సృష్టించి వారి ద్వారా కౌన్సిలర్ గా గెలుపొందారని ఆరోపించారు. తమ పిటిషన్ ను కోర్టు స్వీకరించిందని, వచ్చే నెల 6 న విచారణ జరగనున్నట్లు తెలిపారు. ఈ అంశం ఇప్పుడు కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

