అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Children Death | కామారెడ్డి పట్టణంలో చిన్నారుల అదృశ్యాలు (kamareddy children death) విషాదాంతమవుతున్నాయి. ఇటీవల ఐదుగురు చిన్నారుల అదృశ్యం కేసులో ముగ్గురు అమ్మాయిలు (kamareddy missing boys) కామారెడ్డి పెద్ద చెరువులో తండ్రి చేతిలో హత్యకు గురి కాగా అదృశ్యమైన మరొక ఇద్దరు చిన్నారులు శనివారం ఓ పాడుబడిన బావిలో శవాలై తేలారు.
Kamareddy Children Death | కలకలం రేపుతున్న ఘటనలు..
చిన్నారుల అదృశ్యం.. మృతి ఘటనలు కామారెడ్డి పట్టణంలో (telangana crime news) కలకలం రేపుతున్నాయి. ఈనెల 6న గోసంగి కాలనీకి చెందిన పనేటి శారద కుమారుడు సింహాద్రి (10) అలియాస్ నరసింహ, ఆమె అన్న కుమారుడు కొడండం విజయ్ (9) మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా (kamareddy tragedy news) విచారణ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
Kamareddy Children Death | పాడబడ్డ బావిలో..
శనివారం రాజానగర్ కాలనీలో ఓ పాడుబడిన బావిలో (children accident well) చిన్నారులిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి (local news kamareddy) చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి (telangana police investigation) తరలించారు. పిల్లలు బావిలో చేపలను పడుతూ ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Medak Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

