అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రత్యేక చొరవతో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పాతికేళ్ల తర్వాత క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Kamareddy Collector | రోడ్డు పక్కన నిరాశ్రయుడిగా..
గతనెల 31న రోడ్డుపై నిరాశ్రయుడిగా తిరుగుతున్న ఒక గుర్తుతెలియని వక్తిని గుర్తించిన కలెక్టర్ అతనికి తక్షణమే సహాయం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ వృద్ధాశ్రమ సిబ్బంది ఆ వ్యక్తిని సంరక్షణలోకి తీసుకుని అతనికి ఆహారం, వైద్య సేవలు అందించారు. జగిత్యాల జిల్లా వాసి అయిన అతనికి సేవలు అందిస్తూ, వైద్య పరీక్షలు చేయించి కొత్త జీవితం ఇచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడానికి అవసరమైన చికిత్స అందించారు. ఈ విషయాన్ని కుటుంబ (Kamareddy news) సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు శనివారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్‌ను కలిశారు. పాతికేళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడి తిరిగి తమ చెంతకు చేర్చిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Encroachment Drive | ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
