అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy festival security | రాబోయే రంజాన్ (ramzan safety measures), ఉగాది (ugadi celebrations) పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) అన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు.
Kamareddy festival security | పండుగ సమయాల్లో..
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పండుగ సమయంలో ఎటువంటి వివాదాలు (police advisory india), గొడవలు లేకుండా పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖకు పూర్తి సహకారం (traffic control measures) అందించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, శాంతి భద్రతల (festival security tips) పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు (telangana police) సమాచారం అందించాలన్నారు.
Kamareddy festival security | కామారెడ్డి వారాంతపు మార్కెట్‌లో..
కామారెడ్డి వారాంతపు మార్కెట్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ఎడ్ల బండ్ల కార్యక్రమాన్ని క్రమబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎడ్ల బండ్లను సీరియల్ పద్ధతిలో నిలపాలని, ఎటువంటి గందరగోళం లేకుండా కార్యక్రమం జరగాలన్నారు. ఎడ్ల బండి యజమానులు తమ ఎడ్లను అదుపులో ఉంచుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎడ్లకు ఎలాంటి మత్తు పదార్థాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. అనంతరం ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టే వారాంతపు మార్కెట్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

