అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heavy Rain | కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం(heavy rainfall) కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది.
Kamareddy Heavy Rain | వాహనదారులకు ఇబ్బందులు
బలమైన ఈదురు గాలులతో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో (weather update) ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షంతో కాసేపు జనజీవనం(india weather) స్తంభించిపోయింది. డెయిలీ మార్కెట్ లో, రోడ్లపై కూరగాయలు విక్రయించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నాలుగైదురోజులుగా ఉక్కపోతగా వాతావరణం ఉండడం.. మంగళవారం సాయంత్రం వర్షం పడడంతో పట్టణ ప్రజలు కొంతమేర ఉపశమనం పొందారు.
వడగళ్ల బీభత్సం..
జిల్లాలోని భిక్కనూరు మండలం కాచాపూర్, బస్వాపూర్, పెద్దమల్లారెడ్డిలలో (storm news) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లు పడడంతో (rain disruption) ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైతులు సైతం అకాల వర్షంతో (hailstorm damage) హైరానా పడ్డారు.

పెద్ద మల్లారెడ్డిలో వడగండ్ల వాన.

కాచాపూర్‌లో..
ఇది కూడా చదవండి: Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

