అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Indoor Stadium | ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందేలా కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియం (Indira Gandhi Stadium) ఆవరణలో శనివారం ఆయన రూ.8.80 కోట్లతో చేపట్టబోయే ఇండోర్ స్టేడియం పనులకు భూమిపూజ నిర్వహించారు.
Kamareddy Indoor Stadium | మరింత స్థలం కోసం ఆలస్యం..
స్టేడియం నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన మ్యాప్‌ను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రెండేళ్ల క్రితమే 8.8 కోట్లు మంజూరయ్యాయన్నారు. స్టేడియంలో 8 ట్రాక్స్ రాకుంటే ఇంటర్నేషనల్ గుర్తింపు రాదని అధికారులు చెప్పడంతో మరింత స్థలం కోసం ప్రయత్నించామని తెలిపారు. పక్కనే ఉన్న స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినది కావడంతో విద్యాశాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. స్థలానికి సంబంధించి మంజూరులో ఆలస్యం కావడం జరిగిందని, ఏప్రిల్ 4న స్థలం మంజూరైందని, మొత్తం 33 గుంటల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగుతుందన్నారు. 35 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవు, 9 మీటర్ల ఎత్తులో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.
Kamareddy Indoor Stadium | హైదరాబాద్ తర్వాత కామారెడ్డిలోనే..
ఇంతపెద్ద ట్రాక్ ఉన్న స్టేడియం హైదరాబాద్ (Hyderabad) తర్వాత కామారెడ్డిలో (Kamareddy) మాత్రమే ఉందన్నారు. 9 నెలల్లో ఇండోర్ స్టేడియం పూర్తి కాబోతోందని స్పష్టం చేశారు. టెక్ మహీంద్రా (Tech Mahindra) కంపెనీ వాళ్లు రూ.50 లక్షలతో గ్రౌండ్ అభివృద్ధికి సహకరిస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులు రాత్రి సమయంలో కూడా ఆడుకునేందుకు వీలుగా తన నిధులతో లైటింగ్ ఏర్పాటు చేస్తానని, సీఎం అనుమతితో ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణంలో సరైన వసతులు లేక యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, యువతకు డ్రగ్స్ వైపు మల్లకుండా క్రీడల వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియంలో నాలుగు షటిల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని, అందులో వివిధ రకాల ఆటలకు వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ఇతర అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Iran US Ceasefire | ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా
