అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Industrial Corridor | కామారెడ్డి ఎమ్మెల్యే (Kamareddy MLA) ఢిల్లీలో కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ కామారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తున్నారు. నిధుల మంజూరు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Kamareddy Industrial Corridor | కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిని కలిసి..
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను శుక్రవారం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కలిశారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాలలో యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వ, పైవేటు రంగాలు సంఘటితంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Kamareddy Industrial Corridor | పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు..
కామారెడ్డిలో పరిశ్రమల ఏర్పాటుకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యావంతులైన యువకులు, మహిళలకు కొదవ లేదని ఎమ్మెల్యే వివరించారు. వారిని భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నెలకొల్పితే ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఉత్పాదకత పెరిగి అభివృద్ధి చెందిన ప్రాంతంగా కామారెడ్డి ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ విషయమై మౌఖిక ఆదేశాలు జారీ చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర విభాగాల వారితో సమగ్రంగా చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR) తెలిపారు.
ఇది కూడా చదవండి..: Highway Dhaba Inspections | హైవేపై ఉన్న దాబాల అనుమతులను పరిశీలించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

