అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Mega Job Mela | కామారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఈనెల 22 న జీసీఆర్ ట్రస్ట్ (gcr trust job mela) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
Kamareddy Mega Job Mela | కామారెడ్డి పట్టణంలో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని పార్శిరాములు కల్యాణ మండపంలో (private company job mela) ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 22 కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందన్నారు. ఆయా కంపెనీల్లో దాదాపు 4,886 ఉద్యోగ అవకాశాలు (unemployment youth jobs) ఉన్నట్టు పేర్కొన్నారు. మల్టీ నేషనల్, ఫార్మా, టెలికాం లాంటి దిగ్గజ కంపెనీలు తమను సంప్రదించాయన్నారు. నియోజకవర్గ యువతీయువకులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 9 రోజులు సమయం ఉందని, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
Kamareddy Mega Job Mela | మొత్తంగా 40 కంపెనీల ఆధ్వర్యంలో..
ఉద్యోగ మేళా నాటికి మరొక 12 కంపెనీలు వస్తాయని, సుమారు 40 కంపెనీల ఆధ్వర్యంలో మేళా (kamareddy employment news) నిర్వహిస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము లేదన్నారు. జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జాబ్మేళా ఉంటుందన్నారు. త్వరలో దోమకొండ, బీబీపేట మండలాలను ఫైలెట్గా తీసుకుని ఆ మండలాల్లో యువతులకు ఉపాధి మార్గాలు చూపిస్తామని ఆయన తెలిపారు. త్వరలో విధివిధానాలు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, రంగ రమేష్ గౌడ్, సబ్బని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, రాజశేఖర్, సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్

