అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Missing Children | కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు (Missing Children Case) చేయగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు (Telangana Police) విచారణ చేపడుతున్నారు.
Kamareddy Missing Children | గోసంగి కాలనీలో..
పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని (Kamareddy News) గోసంగి కాలనీకి చెందిన బావ బామ్మర్దులు సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేరు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా పిల్లల ఆచూకీ లభించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kamareddy Missing Children | ఆర్బీనగర్ కాలనీలోనూ..
జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ (Telangana Crime News) కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్, ఆయాత్, మరియం శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆటోడ్రైవర్ అయిన తన తండ్రితో కలిసి ఆటోలో ఓ షాప్ వద్దకు వెళ్లారు. షాప్ వద్ద తినుబండారాలను కొనుక్కున్నారు. అనంతరం తామే తిరిగి ఇంటికి వెళ్తామని తండ్రితో చెప్పడంతో ఆయన ఆటోతో పాత బస్టాండ్ వైపు వెళ్ళాడు. రెండు గంటల అనంతరం తల్లి తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంటికి రాలేరని తెలిపింది. దీంతో షాపు వద్ద వదిలేసి వెళ్లానని ఆయన చెప్పారు.
Kamareddy Missing Children | కేసు నమోదు
సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పట్టణ పోలీస్ స్టేషన్లో(Investigation India) ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ చేరుకొని మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల (CCTV Investigation) ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరికైనా అదృశ్యమైన పిల్లల అచూకీ తెలిస్తే(Child Safety Alert) వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో (Telangana Police) సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఇది కూడా చదవండి: ACB raids Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్ అవాల్సిందే?

