Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్

నిజామాబాద్

Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్

కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం శనివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ ఆమోదానికి ముందు స్థానిక సమస్యలపై కౌన్సిలర్లు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 7:09 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Kamareddy municipal budget |
Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ (Kamareddy Municipality) సమావేశం శనివారం మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన (council meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ ఆమోదానికి ముందు (budget approval) స్థానిక సమస్యలపై కౌన్సిలర్లు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వార్డు ఆఫీసర్ల నుంచి(Kamareddy news) మొదలుకుని కమిషనర్ వరకు అధికారులపై ఫైర్ అయ్యారు.

Contents
  • Kamareddy municipal budget | అధికారులు పూర్తిగా విఫలం..
    • Kamareddy municipal budget | మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు
      • Kamareddy municipal budget | జనరల్​ ఫండ్​ కింద వేతనాలు..

Kamareddy municipal budget | అధికారులు పూర్తిగా విఫలం..

సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. కౌన్సిలర్లు ఫోన్ చేస్తే అధికారుల నుంచి స్పందన కరువైందన్నారు. ఇలా అయితే వార్డుల్లో ప్రజలకు సమాధానం ఏం చెప్తామని నిలదీశారు. టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, కమిషనర్ రాజేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్​కు కూడా కమిషనర్ స్పందించడం కావడం లేదని ఛైర్ పర్సన్ ఉమారాణి ఆరోపించారు. దాంతో టీపీవోను, కమిషనర్​ను సరెండర్ చేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు వివిధ సమస్యలపై వాడీవేడిగా చర్చించారు. ఆ తర్వాత బడ్జెట్​ను(municipal budget) అధికారులు చదివి వినిపించగా కౌన్సిల్ సభ్యులు చేతులెత్తి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫంక్షన్ హాల్​లో నిర్వహిస్తూ.. ఈ ఏడాది మున్సిపల్ కౌన్సిల్ హాల్​లో నిర్వహించడంపై పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు.

Kamareddy municipal budget | మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు

ప్రస్తుత 2026-27కుగాను.. వార్షిక బడ్జెట్​ను అధికారులు రూపొందించారు. వివిధ మార్గాల ద్వారా (local governance) ఆదాయాన్ని రూ.70,86,77,000లుగా చూపించారు. అదేవిధంగా ఖర్చులు సైతం రూ.70,85,43,000గా తేల్చారు. గత సంవత్సర బడ్జెట్ అంచనా రూ.46,86,76000 ఉండగా ఖర్చు రూ.46,78,73,000 ఉంది. ఈ ఏడాది ఆదాయం మార్గాలను గణనీయంగా పెంచారు. పన్నుల ద్వారా రూ.20,74,28,000గా చూపించారు. పన్నేతర ద్వారా రూ.12,20,72,000 డిపాజిట్లు, అడ్వాన్స్, లోన్ల ద్వారా రూ.4.20 కోట్లు, క్యాపిటల్ ప్రాజెక్టు ఫండ్స్ (గ్రాంట్లు, స్కీములు) ద్వారా రూ.33 కోట్ల 71 లక్షల 77 వేల ఆదాయం వస్తున్నట్టుగా బడ్జెట్లో పేర్కొన్నారు.

Kamareddy municipal budget | జనరల్​ ఫండ్​ కింద వేతనాలు..

అలాగే వ్యయం వివరాలలో మున్సిపల్ జనరల్ ఫండ్ కింద వేతనాలు(urban development), శానిటేషన్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు, 10 శాతం హరితహారం కోసం రూ.22,45,50,000 ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇతర నిర్వహణ వ్యయం కింద ఇంజినీరింగ్, సాధారణ పరిపాలన విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం రూ.6.56 కోట్లుగా అంచనా వేశారు. సాధారణ వ్యయం కింద (Telangana politics) పెట్టుబడి వ్యయం 1/3 వ వంతు బడ్జెట్ వెనుకబడిన, మురికి వాడలు, విలీన గ్రామాలు, మౌలిక వసతుల ఖర్చులకు, ప్రజసౌకర్యాల కోసం, వార్డుల వారీగా పనుల వ్యయం మొత్తాన్ని(Telangana civic) రూ.3 కోట్ల 92 లక్షల 16 వేలుగా నిర్ధారించారు.

వీటి ఖర్చు కలిపి రూ.32,93,66,000 మొత్తాన్ని మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయనున్నారు. ఇక డిపాజిట్లు, అడ్వాన్సు, లోన్స్ కోసం రూ.4.20 కోట్లు, క్యాపిటల్ ప్రాజెక్టు ఫండ్స్ (గ్రాంట్లు, స్కీములు) వ్యయాన్ని రూ.33,71,77,000 వేలుగా చూపించారు. మొత్తం రూ.70,86,77,000 ఆదాయంలో రూ.70,85,43,000 ఉంటుందని బడ్జెట్​లో ప్రతిపాదించారు. ఈ బడ్జెట్​కు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి, జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్, కామారెడ్డి ఆర్డీవో ఎన్​వై గిరి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్​ సీజ్​
SSC Exams | ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
Gandhari wrestling competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు..
TAGGED:budget approvalcouncil meetingKamareddy Municipalitylocal governancemunicipal budgetTelangana civicTelangana Politicsurban development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyundai Venue Price Hike Hyundai Venue Price Hike | షాకిచ్చిన హ్యుందాయ్.. వె‘న్యూ’ కార్ల ధరలిలా..
Next Article Illegal Bakery Illegal Bakery | అక్రమంగా నిర్వహిస్తున్న బేకరీపై పోలీసుల దాడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?