Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..

నిజామాబాద్

Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..

కామారెడ్డి పట్టణంలో మున్సిపల్​ అధికారుల తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వసతులు కల్పించలేదంటూ బీజేపీ, బీఆర్​ఎస్​ కౌన్సిలర్ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు.​

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 12:41 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Kamareddy Municipal Controversy
Kamareddy Municipal Controversy

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Controversy | ‘కొత్తగా ఏర్పడిన పాలకవర్గ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వరా..? ఇదేనా మాకు మీరిచ్చే గౌరవం..’ అంటూ.. మున్సిపల్ నూతన పాలకవర్గ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల (Municipal Officers)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 99 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటిరోజే రసాభాసగా మారింది.

Contents
  • Kamareddy Municipal Controversy | కుర్చీల్లేవు.. సరైన టెంట్​ లేదంటూ..
    • Kamareddy Municipal Controversy | కమిషనర్​ నిలదీత..
      • Kamareddy Municipal Controversy | వెనుదిరిగిన బీజేపీ, బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు..

Kamareddy Municipal Controversy | కుర్చీల్లేవు.. సరైన టెంట్​ లేదంటూ..

Kamareddy Municipal Controversy
Kamareddy Municipal Controversy

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శుక్రవారం ఉదయం రావాల్సిందిగా గురువారం రాత్రి మున్సిపల్ కౌన్సిలర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. కొంతమందికి వార్డు ఆఫీసర్లు ఫోన్​చేసి సమాచారమిచ్చారు. అయితే ఆహ్వానం మేరకు మున్సిపల్ కార్యాలయానికి (Municipal Office) వచ్చిన కౌన్సిలర్లకు సరిపడా కుర్చీలు వేయలేదు. టెంటు కూడా సగం మందికే సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఎండలో కుర్చీలు వేసి ఉండడం, టెంట్ సరిగా లేకపోవడం, కౌన్సిలర్ల మాట ఎత్తకుండా సమావేశం ప్రారంభించడం పట్ల కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kamareddy Municipal Controversy | కమిషనర్​ నిలదీత..

Kamareddy Municipal Controversy
Kamareddy Municipal Controversy

పాలకవర్గం గెలిచాక ఇప్పటివరకు ఒక్క సమావేశమైనా ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నారా అంటూ కమిషనర్​ను నిలదీశారు. సమస్యలు చెప్పడానికి వస్తే కనీస స్పందన కూడా ఉండడం లేదని, ఇన్​వార్డు సెక్షన్​లో ఫిర్యాదు చేస్తే తీసుకునే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. వార్డుల్లో శానిటేషన్ పరిస్థితి గందరగోళంగా ఉందని, చెత్త వాహనాలు సరిగ్గా రావడం లేదని, ఇలా అయితే ప్రజలకు తాము సమాధానం ఏం చెప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వరా అంటూ మండిపడ్డారు.

Kamareddy Municipal Controversy | వెనుదిరిగిన బీజేపీ, బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు..

అధికారుల తీరును నిరసిస్తూ బీజేపీ (BJP Councilors), బీఆర్ఎస్ కౌన్సిలర్లు (BRS Councilors) సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. కమిషనర్, ఛైర్​పర్సన్ బతిమాలినా వినిపించుకోకుండా సమావేశాన్ని బాయ్​కాట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మాత్రమే ఉండగా ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా ఆర్పీలకు కనీసం కుర్చీలు కూడా కరువయ్యాయి. కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు కొంతమంది ఆర్పీలు మెట్లపై కూర్చోగా మరికొందరు నిలబడే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు

Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Kamareddy Mega Job Mela | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
TAGGED:bjp brs councillors boycottBJP CouncilorsBRS Councilorscouncillors protestkamareddy municipal councilKamareddy Newslocal politics telanganamunicipal administration issuesMunicipal OfficeMunicipal Officersprajapalana pragati programtelangana municipal politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Engineering Fees Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
Next Article Divvela Madhuri Controversy Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?