అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Arrest | ఓ వ్యక్తిని హత్యచేసి అతని వద్ద మొబైల్, నగదు తీసుకుని (Kamareddy news) పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) మీడియాకు వివరాలు వెల్లడించారు.
Kamareddy Murder Arrest | బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద..
గత ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి సుమారు 8:55 గంటల సమయంలో బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఆకాష్ నాగురావ్ కోవె మరొక వ్యక్తి శ్రీనివాస్‌తో మొబైల్ ఫోన్ విషయమై గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆకాష్ నాగురావ్ కోవె శ్రీనివాస్ ముఖం, ఛాతిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీనివాస్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.300 నగదును దోచుకుని ఆకాష్ అక్కడినుంచి పరారయ్యాడు. బస్టాండ్ కంట్రోలర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. శనివారం కామారెడ్డి రైల్వే స్టేషన్ (Kamareddy Railway Station) పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించినట్టు ఏఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్ వార్నింగ్..
