అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy PG Results | కామారెడ్డి ప్రభుత్వ కళాశాల (Kamareddy Government College) పీజీ ప్రథమ, తృతీయ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు (Kamareddy news)ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ (Telangana University) పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
Kamareddy PG Results | 90 శాతానికి పైగా ఉత్తీర్ణత..
ఈ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దాదాపు అన్ని విభాగాల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత(Semester results) నమోదు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదలతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి కళాశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను పాటించడం వల్ల ఫలితాలను సకాలంలో విడుదల చేయగలిగామని పేర్కొన్నారు. అటానమస్ హోదా(Autonomous Status) పొందిన తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఫలితాల్లోనూ నాణ్యత పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పరీక్షా విభాగం అధికారులు రాములు, రాజేందర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: RSS Cheif Mohan Bhagwat | రేపు జిల్లాకు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
