అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు(kamareddy news) చేపట్టిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 1.6 కిలోల గంజాయిని పట్టుకుని 9 మందిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు.
Kamareddy Police | ఇల్చిపూర్ శివారులో..
ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ..(ganja seizure) నమ్మదగిన సమాచారంతో దేవునిపల్లి పోలీసులు ఇల్చిపూర్ శివారులో(police crackdown) వీఐపీ వెంచర్ వద్ద తనిఖీలు చేపట్టారన్నారు. దాంతో అక్కడున్న కొందరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం(drug trafficking india) చేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారని తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించి చిన్న చిన్న ప్యాకెట్లలో కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టుగా తేలిందన్నారు. వారి వద్ద నుంచి 1.6 కిలోల గంజాయి, రెండు బైకులు, 8 మొబైల్స్, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Kamareddy Police | ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం..
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.50 వేలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం(ndps act india) నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల్లో గాంధారికి చెందిన మంజ వెంకట్రాం, గాంధారి మండలం చద్మల్ తండాకు చెందిన బామన్ అమర్ సింగ్, గుడిమెట్ గ్రామానికి చెందిన అర్ల మధుసూదన్ రావు (telangana police) ఉన్నారని వెల్లడించారు. అలాగే రాజాంపేటకు చెందిన దేవుని పృథ్వి, కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్ పురా కాలానికి చెందిన షేక్ సమీర్, షేక్ అహ్మద్, బతుకమ్మ కుంటకు చెందిన లాలమ్మల ప్రశాంత్ కుమార్, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆండే సంజయ్, శ్రీగాధ నరేష్‌లను కొనుగోలుదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బంది పాల్గొన్నారు.
