Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

నిజామాబాద్

Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 13, 2026 8:12 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు
Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police Sports | తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కామారెడ్డి పోలీస్ (police sports competition) క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (cyberabad police event) వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్’ నిర్వహించారు.

Contents
  • Kamareddy Police Sports | పదకొండు పతకాలు సాధించి..
    • Kamareddy Police Sports | గెలుపోటములు సహజం..

Kamareddy Police Sports | పదకొండు పతకాలు సాధించి..

పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చి మొత్తం 11 పతకాలు సాధించారు. అందులో ఒక రజతం, 10 కాంస్యం పతకాలు ఉన్నాయి. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన విజేతలను, (police athletes telangana) టీం ఇన్​ఛార్జి రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సంతోష్ కుమార్​ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ప్రత్యేకంగా అభినందించి, వారికి పతకాలు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధి నిర్వహణలో (telangana police sports meet) ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు దివ్యౌషధంలా పనిచేస్తాయన్నారు. ఇవి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.

Kamareddy Police Sports | గెలుపోటములు సహజం..

గెలుపు ఓటములు సహజమని, పతకాలు సాధించిన వారు జాతీయ స్థాయిలో రాణించేలా మరింత పట్టుదలతో కృషి చేయాలని ఎస్పీ అన్నారు. ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో విజయాలు సాధించాలని దిశా నిర్దేశం చేశారు. పోటీల ఫలితాల్లో భాగంగా టేబుల్ టెన్నిస్ (table tennis archery powerlifting) పురుషుల సింగిల్స్‌లో కానిస్టేబుల్ తిరుపతి రజత పతకం సాధించగా, ఆర్చరీలో సరిచంద్, పవర్ లిఫ్టింగ్ 66 కిలోల విభాగంలో జానకీరాం, రెజ్లింగ్ 92 కిలోల విభాగాల్లో బాలరాజ్, ఏఆర్‌ కానిస్టేబుల్ అంకోష్, 97 కిలోల విభాగంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రభు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మహిళా విభాగంలో 30 కిలోమీటర్ల సైక్లింగ్‌లో డబ్ల్యూపీసీ రజిత, కబడ్డీ పోటీల్లో (kabaddi cycling police) డబ్ల్యూహెచ్‌సీ బుజ్జి, డబ్ల్యూపీసీ సవితారాణి, డబ్ల్యూపీసీ రేఖ, డబ్ల్యూపీసీ ప్రియాంకల బృందం కాంస్య పతకాలతో జిల్లా కీర్తిని చాటారని ఎస్పీ తెలిపారు.

sp office

ఇది కూడా చదవండి: Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి

Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..
Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
TAGGED:cyberabad police eventkabaddi cycling policeKamareddy Policepolice athletes telanganapolice sports competitionSP Rajesh Chandrasports achievements policetable tennis archery powerliftingtelangana police sports meet
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR Letter to Amit Shah KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్​
Next Article Ustaad Bhagat Singh Ticket Prices Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?