అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Modernization | కామారెడ్డి రైల్వే ఆధునీకరణ పనులకు నిధులిచ్చి సహకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కోరారు. ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Kamareddy Railway Station) అశ్విని వైష్ణవ్‌ను (Ashwini Vaishnaw) కలిసి విన్నవించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎమ్మెల్యే రమణారెడ్డి (K Venkata Ramana Reddy MLA) ఒక ప్రకటన విడుదల చేశారు.
Kamareddy Railway Modernization | కామారెడ్డి పట్టణ రైల్వేస్టేషన్..
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విస్తరణ కింద ఓరియంటల్ పాఠశాల నుండి దర్శన్ థియేటర్ ముందు వరకు అభివృద్ధి చేయాలని, దాని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు. పాత రైల్వే క్వార్టర్లను (Indian Railways Projects) తొలగించి కొత్తగా వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని, స్టేషన్ రోడ్ వైపు ఉన్న రైల్వే భవనాలు వివేకానంద కాలనీ వైపు నిర్మించాలని కోరానన్నారు. అలాగే నూతన రైల్వే భవనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన ప్లాన్లు పూర్తయ్యాయని, మంత్రి నుండి సానుకూల స్పందన వచ్చిందని, వాటి నిర్మాణానికి ప్లాన్స్ పూర్తి చేసి ప్లాన్స్ డిపార్ట్మెంట్ నుండి కనస్ట్రక్షన్ డిపార్ట్మెంట్కు పంపారన్నారు. త్వరలోనే నిధులు కేటాయిస్తూ అనుమతులు కూడా ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా తెలిపారన్నారు.
Kamareddy Railway Modernization | జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలో మూడుచోట్ల ఆర్వోబీల (Indian Railways Projects) నిర్మాణానికి గతంలో చేసిన వినతులకు స్థల పరిశీలన, జాయింట్ ఇన్ఫెక్షన్, సాయిల్ టెస్టింగ్ అన్ని త్వరలో పూర్తిచేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభమై రెండేళ్లలోపు పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో తనకు పూర్తిగా సహకారం అందిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..

