అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Robbery Arrest | అర్ధరాత్రిళ్లు దారి దోపిడీలు చేస్తున్న నిందితుడిని పోలీసులు (Kamareddy news) అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (Kamareddy sub-division ASP Chaitanya Reddy) వివరాలు వెల్లడించారు.
Kamareddy Robbery Arrest | బైక్‌పై అడ్డగించి.. దోపిడీ చేసి..
ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ రోడ్ సమీపంలోని చర్చి వద్ద ఈనెల 1న అర్ధరాత్రి (Midnight robbery) సమయంలో గోలీ సుధీష్ కుమార్ అనే విద్యార్థి తన స్నేహితుడిని వదిలి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి అతడిని అడ్డగించాడు. కత్తితో బెదిరించి రూ.2 వేలు నగదు తీసుకోవడంతో పాటు ఫోన్‌పే ద్వారా రూ.8వేలు బలవంతంగా ట్రాన్స్ఫర్ (Digital payment fraud) చేయించుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Kamareddy Robbery Arrest | సాంకేతిక ఆధారాలతో..
అనంతరం సాంకేతిక ఆధారాలతో.. శనివారం కామారెడ్డి గంజ్‌లో (Crime news Telangana) నిందితుడిని పట్టుకొని విచారించగా అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే(Police arrest) ఉద్దేశంతో ముందుగా ప్రణాళిక వేసుకుని అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న(Robbery case India) వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది. దాంతో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నిందితుడు శివరాత్రి నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి బైక్, కత్తి, మొబైల్ ఫోన్, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
