అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐగా (Kamareddy news) విధులు నిర్వర్తిస్తున్న రామన్ బదిలీ (KamareddyPolice) అయ్యారు. సిద్దిపేట ఎస్బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్(Sridhar Goud) కామారెడ్డి రూరల్ సీఐగా రానున్నారు.
Kamareddy Rural CI Transfer | కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, కామారెడ్డి రూరల్ సీఐగా రామన్ పనిచేశారు. ఇక్కడ దాదాపు రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన బదిలీపై(CI transfer) వెళ్లారు. ఆయనను హైదరాబాదులోని ఐజీ కార్యాలయానికి (Hyderabad IG office) ప్రభుత్వం బదిలీ చేసింది. కామారెడ్డి రూరల్ సీఐగా పని చేయడానికి అనేకమంది తమ ప్రయత్నాలు కొనసాగించినట్లుగా(Telangana police) ప్రచారం సాగింది. గత కొంతకాలంగా రూరల్ సీఐ బదిలీ అవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడికి వచ్చే అధికారుల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తదే అని తేలింది. సిద్దిపేట ఎస్బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా రానున్నారు. రేపోమాపో ఆయన బాధ్యతలు తీసుకొనున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్ బుకింగ్
