Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!

తెలంగాణతాజా వార్తలునిజామాబాద్

Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!

పిల్లలపై ప్రేమ, గౌరవం, సంరక్షణ పెంపొందించాల్సిన బాధ్యత కుటుంబం నుంచి మొదలవుతుంది. బాలికల భద్రతకు చట్టాలు మాత్రమే సరిపోవు. సమాజపు ఆలోచనా విధానం మారాలి. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఒక కుటుంబానికి ఆశ. ప్రతి మహిళ సమాజానికి శక్తి.

Naresh chandan
Last updated: మార్చి 8, 2026 8:46 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
akshara sisters

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kamareddy Sisters Murder | మహిళల సాధికారత, సమానత్వం, హక్కుల కోసం మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ విజయాలను గుర్తుచేసుకుంటూ… అతివలకు సమాజంలో ఎదురయ్యే అన్యాయాలపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు ఇది.

Contents
  • Kamareddy Sisters Murder | తినుబండారాల కోసం వెళ్లి తిరిగి రాని పసిమొగ్గలు
    • Kamareddy Sisters Murder : తండ్రే కాలయముడైతే…
      • Kamareddy Sisters Murder : అన్యాయాల ప్రతిబింబం
      • మహిళా దినోత్సవం చెప్పే సందేశం

కానీ, ఈ ప్రత్యేక దినోత్సవానికి ఒకరోజు ముందు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన సమాజాన్ని కలచివేసింది. కామారెడ్డి పట్టణం ఆర్బినగర్ కాలనీలో నివసించే ముగ్గురు చిన్నారులు.. సిపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) అనుమానాస్పదంగా అదృశ్యమై అనంతరం చెరువులో మృతదేహాలుగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడినట్లు తేలడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Kamareddy Sisters Murder | తినుబండారాల కోసం వెళ్లి తిరిగి రాని పసిమొగ్గలు

శనివారం ఉదయం పిల్లలు తమ తండ్రితో కలిసి తినుబండారాలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లారు. అయితే కొంతసేపటికి వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కామారెడ్డి పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లి విలపించిన దృశ్యాలు అక్కడి ప్రజల హృదయాలను కలిచివేశాయి.

Kamareddy Sisters Murder : తండ్రే కాలయముడైతే…

తండ్రి అంటే పిల్లలకు రక్షణ.. భద్రత.. ప్రేమ.. కానీ అదే తండ్రి కాలయముడిగా మారితే?.. ఆ చిన్నారుల మనసులో చివరి క్షణాల్లో ఎంత భయం, ఎంత బాధ, ఎంత నిరాశ నిండివుండి ఉంటుందో ఊహించుకోవడమే గుండెల్ని పిండేస్తుంది. ఇంకా జీవితాన్ని చూడని పసిమొగ్గల జీవితం అర్ధంతరంగా ముగిసింది. నిండుగా నూరేళ్లు బ్రతకాల్సిన మూడు చిన్న జీవితాలు… కొన్ని నిమిషాల్లోనే చీకటిలో కలిసిపోయాయి.

Kamareddy Sisters Murder : అన్యాయాల ప్రతిబింబం

మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పే రోజు మాత్రమే కాదు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, హింస, వివక్షను గుర్తించి సమాజం ఆలోచించాల్సిన రోజు. ప్రపంచవ్యాప్తంగా మూడు మహిళల్లో ఒకరు జీవితంలో ఏదో ఒక దశలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతదేశంలో కూడా పరిస్థితి పూర్తిగా మారలేదనే వాస్తవం ఇలాంటి సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. బాలికలపై హింస, లైంగిక దోపిడీ, కుటుంబ హింస, బాల్య వివాహాలు వంటి సమస్యలు ఇంకా సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.

మహిళా దినోత్సవం చెప్పే సందేశం

ఈ సంవత్సరం మహిళా దినోత్సవం “Rights. Justice. Action. For ALL Women and Girls” అనే భావనను ముందుకు తెస్తోంది. అంటే మహిళల హక్కులు కేవలం చట్టాల్లోనే కాకుండా జీవితంలో కూడా నిజంగా అమలు కావాలి అన్నది దీని సందేశం. కానీ, కామారెడ్డి ఘటన మనకు ఒక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది. మహిళల భద్రత కోసం పోరాటం ఇంకా పూర్తికాలేదని చెబుతోంది.

ఇది కూడా చదవండి: Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!

Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!
Twin Groom Death | పెళ్లి చేసుకున్న కవలల్లో ఒకరు మృతి.. ఘటనపై పలు అనుమానాలు..
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
TAGGED:child safety indiacrime against girlsInternational Women's DayKamareddy NewsKamareddy sisters murderTelangana Crime Newswomen rights awarenesswomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం! March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
Next Article Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?