Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​

నిజామాబాద్

Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​

జిల్లా కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం 300 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్/ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కోరారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 9, 2026 9:29 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy Sports Village |
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..కేంద్ర మంత్రిని కోరిన కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్​

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Sports Village | జిల్లా కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం 300 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్/ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Kamareddy MLA KVR)కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను (Mansukh Mandaviya) కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Kamareddy Sports Village | పంజాబ్​లో మాత్రమే..
    • Kamareddy Sports Village | కామారెడ్డి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు..

Kamareddy Sports Village | పంజాబ్​లో మాత్రమే..

ఇప్పటి వరకు ఉత్తరాది పంజాబ్​లో మాత్రమే స్పోర్ట్స్ విలేజ్ ఉందని, అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయటానికి కృషి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యువ ప్రతిభను పెంపొందించడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా సంస్కృతిని (Telangana sports development) ప్రోత్సహించడానికి కామారెడ్డి జిల్లాలో సమగ్ర క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో, స్పోర్ట్స్ స్కూల్ / స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు కోసం కామారెడ్డి పట్టణానికి (Kamareddy news) ఆనుకొని ఉన్న సుమారు 300 ఎకరాల తగిన ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రతిపాదిత స్పోర్ట్స్ స్కూల్ సౌకర్యం వల్ల క్రీడా అభివృద్ధికి ప్రత్యేక కేంద్రంగా, నివాస శిక్షణ, కోచింగ్, హాస్టళ్లు, ఆట స్థలాలు, ఇండోర్ స్టేడియంలు, బహుళ క్రీడా విభాగాలకు అనుబంధ మౌలిక సదుపాయాలను అందిస్తుందని, దీని ద్వారా గ్రామీణ, పట్టణ యువత క్రీడలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Kamareddy Sports Village | కామారెడ్డి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు..

కామారెడ్డి జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, (Telangana politics)పెంపొందించడం, శాస్త్రీయ శిక్షణ, ఆధునిక శిక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం కోసం అవకాశాలను సృష్టించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని, తెలంగాణ క్రీడా పర్యావరణ వ్యవస్థలో కామారెడ్డి జిల్లా పాత్రను పెంచుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణానికి హైదరాబాద్​ దగ్గరగా ఉన్నందున మెరుగైన కనెక్టివిటీ, విద్యా నివాస సౌకర్యాలతో భూమిని గుర్తించిన తర్వాత, సంబంధిత క్రీడా అభివృద్ధి పథకాల కింద ఆమోదం, నిధుల కోసం అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సాధ్యాసాధ్యాల అంచనా కోసం వీలైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని, తదుపరి చర్య కోసం ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రిని కలిసి విన్నవించినట్లు తెలిపారు.

kmr 1

ఇది కూడా చదవండి: Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు

Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : ఎమ్మెల్యే ధన్​పాల్​
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’
Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..
TAGGED:Integrated sports schoolKamareddy NewsKamareddy sports villageKVR MLA KamareddyMansukh MandaviyaTelangana PoliticsTelangana sports developmentYouth sports infrastructure
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article LPG Booking Interval LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Next Article Telangana Law and Order Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం పాత్ర..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?