Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు

నిజామాబాద్

Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే ఆయా పరిక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 14, 2026 3:12 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy SSC Exams |
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SSC Exams | జిల్లాలో పదో తరగతి పరీక్షలు (kamareddy SSC exams) మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే ఆయా పరిక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్ ఏ గదిలో ఉందో (telangana board exam) తెలుసుకుని గదుల్లోకి వెళ్లారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.

Contents
  • Kamareddy SSC Exams | ఓఎంఆర్​ షీట్​పై అవగాహన
    • Kamareddy SSC Exams | పరీక్ష కేంద్రాల వద్ద కళాశాలల ప్రచారాలు..

Kamareddy SSC Exams | ఓఎంఆర్​ షీట్​పై అవగాహన

పరీక్ష కేంద్రంలో సుమారు 15 నిమిషాల పాటు ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలనే విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో (kamareddy district news) మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటిరోజు 13,117 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Kamareddy SSC Exams | పరీక్ష కేంద్రాల వద్ద కళాశాలల ప్రచారాలు..

పదో తరగతి బోర్డు పరీక్షలు శనివారం ప్రారంభం కాగా కళాశాలల యాజమాన్యాలు పరీక్ష కేంద్రాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వారివారి కళాశాలలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి అన్ని గ్రామాలను కళాశాలల యాజమాన్యాలు చుట్టుముట్టాయి. పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. తాజాగా పరీక్ష కేంద్రాల (exam centers kamareddy) వద్ద విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలకు (education news telangana) సంబంధించిన పత్రాలు, బుక్​లెట్లను అందజేయడం పలువురు తల్లిదండ్రులకు చికాగు తెప్పించింది. తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తున్నారోనని ఓవైపు తాము టెన్షన్ పడుతుంటే తమ స్వలాభం కోసం యాజమాన్యాలు చేపడుతున్న(college promotions issue) ప్రచారాన్ని పలువురు తప్పుబట్టారు. పరీక్షల చివరిరోజు ఈ రకమైన విధానాన్ని ఎంచుకుంటే తప్పు లేదని, ఇప్పుడు ఇలా చేయడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ప్రచారాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ww23

ఇది కూడా చదవండి: Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం

Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
TAGGED:college promotions issueeducation news telanganaexam centers kamareddykamareddy 10th examsKamareddy district newsssc exams telanganastudents attendance ssctelangana board exams
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Taliban Drone Attacks Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
Next Article Kamareddy Mega Job Mela | Kamareddy Mega Job Mela | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?