అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Arrest | రాత్రి సమయంలో బస్టాండ్లో ఓ మహిళ వద్ద బ్యాగు(bag snatching) దొంగిలించి పారిపోతున్న దొంగలను క్రైం బీట్ సిబ్బంది (police bravery) పట్టుకున్నారు. ఈ సందర్భంగా(police action) మంగళవారం సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అభినందించారు.
Kamareddy Theft Arrest | కామారెడ్డి పట్టణంలోని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీలో క్రైం బీట్ సిబ్బంది గస్తీ(night patrol) నిర్వహిస్తున్న సమయంలో ఓ బైక్పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నట్లు గమనించి వెంబడించి బైక్ ఆపారు. వారి వెంట ఉన్న మహిళను గమనించి వారి వద్ద ఉన్న బ్యాగు గురించి ఆరా తీయగా (crime news india) సరైన సమాధానం చెప్పలేదు. అదే సమయంలో బ్యాగులో ఉన్న ఫోన్ మోగడంతో పోలీసులు ఆన్సర్ చేయగా అవతలి వైపు ఓ మహిళ ఆ బ్యాగు తనదేనని, బస్టాండ్లో ఉన్న తనవద్ద నుంచి బ్యాగు ఎత్తుకెళ్లారని చెప్పడంతో తాము పోలీసులమని బ్యాగు ఎక్కడికి వెళ్లలేదని ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
Kamareddy Theft Arrest | విధుల్లో అప్రమత్తంగా ఉండి..
అనుమానాస్పద వ్యక్తులను (theft arrest) పోలీస్ స్టేషన్ కు తరలించి (law enforcement) బ్యాగును బాధితురాలికి అప్పగించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి చోరీ జరగకుండా చూసిన క్రైం బీట్ సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, హోంగార్డు నర్సింలును మంగళవారం ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Gurukul Entrance Results | గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

