అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Arrest | జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ (kamareddy theft arrest) చేశారు. వారి వద్ద నుండి భారీగా వెండి నగలు, నగదు, కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Kamareddy Theft Arrest | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో..
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ (kamareddy police news) పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన వడ్డే పద్మ గతనెల 22న పని నిమిత్తం తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంటికి తాళం వేసి వెళ్లగా, గుర్తు తెలియని దొంగలు ఇంటి తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉంచిన సుమారు 3 తులాలు బంగారు పుస్తెలు తాడు, 15 తులాలు వెండి నడుము గొలుసు, 15 తులాల బ్రాస్లెట్లు, 8 తులాలు వెండి ముద్దలు, కొంత నగదును (telangana burglary case) దొంగిలించుకు వెళ్లారు. అదే సమయంలో సమీపంలోని మరో ఇంటి తలుపు కూడా పగులగొట్టి అక్కడ ఉంచిన సుమారు 10 తులాలు వెండి ముద్దలను కూడా దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Kamareddy Theft Arrest | జిల్లా ఎస్పీ ఆదేశాలతో..
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఐలు రామన్, సంతోష్ ఎస్సైల బృందం రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. శనివారం ఉదయం టేక్రియాల్ ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన సిద్దిపేట జిల్లాకు చెందిన నూనె నర్సింలు, మరో మైనర్లను పోలీసులు (interstate thieves arrested) అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా రెండు నెలలుగా దేవునిపల్లి, తాడ్వాయి సదాశివనగర్ మండలాల్లో మూడు ఇళ్లలో దొంగతనాలు చేయడంతో పాటు మూడు ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ (copper wire theft gang), ఎర్త్ వైర్లు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు.
Kamareddy Theft Arrest | నలుగురు ప్రత్యేక బృందంగా ఏర్పడి..
నలుగురు కలిసి ఒక ప్రత్యేక గ్యాంగ్‌గా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. కేవలం ఇళ్లలోనే (house burglary kamareddy) కాకుండా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేసి, వాటిలోని విలువైన కాపర్ కాయిల్స్, ఎర్త్ పట్టీలను ( transformer copper theft) కూడా దొంగిలిస్తున్నట్లు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే మిగతా ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిండుతుల వద్ద నుండి 20 తులాల వెండి కాళ్ల పట్టీలు, 5 తులాల వెండి ముద్ద, 15 తులాల వెండి కాళ్ల పట్టీలు, ఒక ఫోన్, ఐక్యూ మొబైల్ ఫోన్, రూ.4,500 నగదు, 15 కిలోల రాగి వైరు, 10 కిలోల రాగి ఎర్త్ వైరు, ఎక్సల్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నూనె నర్సింలుపై గతంలో సైబరాబాద్‌లోని శామీర్‌పేట్, సిద్దిపేట జిల్లాలోని రైపోల్, తొగుట, కుకునూర్ పల్లి పోలీసు స్టేషన్లలో చోరీకేసులు ఉన్నాయని, మైనర్‌పై మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు, రామగుండం, సైబరాబాద్ కమిషనరేట్లలో 9 చోరీ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్డేట్.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు

