అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karachi US Consulate Attack | పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. US కాన్సులేట్‌పై ఆందోళనకారులు ఆదివారం దాడి చేశారు. వందలాదిగా తరలి వచ్చిన యువకులు కర్రలు, రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khameni) మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికా చర్యలను ఖండిస్తూ.. ఇరాన్‌కు మద్దతుగా పాక్ పౌరులు నినాదాలు చేశారు. గేట్లు దాటుకుని కాన్సులేట్ లోపలికి వెళ్లారు. కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు యత్నించారు. భద్రత సిబ్బంది, పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Karachi US Consulate Attack | ఒకరి మృతి
వందలాది మంది ప్రజలు యూఎస్ కాన్సులేట్ ఆఫీస్‌లోకి చొరబడి కిటికీలను పగులగొట్టారని పోలీసులు తెలిపారు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు, పారామిలిటరీ దళాలు లాఠీలు ప్రయోగించాయని, భాష్ప వాయువు (Tear Gas)ను ప్రయోగించాయని పోలీసు అధికారి మొహమ్మద్ జావాద్ తెలిపారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక నిరసనకారుడు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అన్నారు. ఇజ్రాయెల్ (Israel), అమెరికా సంయుక్త రాష్ట్రాలు జరిపిన పెద్ద దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన కొన్ని గంటల తర్వాత కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Karachi US Consulate Attack | బాగ్దాద్‌లో..
ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యతో బాగ్దాద్ (Bagdad)లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల నిరసనకారులు గుమిగూడారు. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో అస్థిరతకు ఆజ్యం పోస్తోందని ఆరోపిస్తూ, ఈ ప్రాంతంలో విదేశీ సైనిక ప్రమేయాన్ని అంతం చేయాలని నినాదాలు చేశారు.

