అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karimnagar ACB Arrest | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. కరీంనగర్ (Karim Nagar)లోని జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ (WA) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
మధుసూదన్ 2022 సెప్టెంబర్ 15 నుంచి 2023 సెప్టెంబర్ 20మధ్య కాలంలో రూ.14,77,003 లంచాలను డిమాండ్ చేసి యూపీఐ (UPI) లావాదేవీల ద్వారా స్వీకరించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లోని ఒక బినామీ ఖాతాను ఉపయోగించి మధుసూదన్ లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. పరిశీలన, ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ఫైళ్లలోని లోపాలను దాచడం, సవరించడం వంటి వాటి కోసం అతడు లంచాలు తీసుకున్నాడు.
Karimnagar ACB Arrest | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

