అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka Politics | కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి సీఎం మార్పు ఊహాగానాలు వేడెక్కుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు సహా.. దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ మీటింగ్ నిర్వహించినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నాయకత్వ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. భవిష్యత్తు వ్యూహాలపై ఎమ్మెల్యేలు చర్చించారని, పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయో వేచి చూస్తున్నారని ప్రచారంలో ఉంది.
Karnataka Politics |
ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాటకకు చెందిన 20 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యూజిలాండ్,ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిలో కొందరు సీఎం సిద్ధరామయ్యకు చెందిన సమీప నేతలు కూడా ఉన్నారు. వచ్చే మార్చి 1వ తేదీన బెంగళూరుకు తిరిగి రానున్న వీరి పర్యటన.. కేవలం వ్యవసాయ రంగంపై అధ్యయన యాత్రగా పేర్కొంటున్నారు. కాగా, ఒక ఎమ్మెల్యే మాత్రం తన సొంత ఖర్చుతోనే వెళ్లినట్లు చెబుతున్నారు.
Karnataka Politics |
సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి తన పర్యటనను పూర్తిగా వ్యక్తిగతమైందని పేర్కొన్నారు. దీనికి రాజకీయ సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో నాయకత్వంపై ఎలాంటి గందరగోళం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. హైకమాండ్ ఎలాంటి అనిశ్చితి సృష్టించలేదని, సమస్యలు ఉంటే రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని సూచించారు.
Karnataka Politics |
ఇక కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య – డి.కె. శివకుమార్ మధ్య 2.5 సంవత్సరాల చొప్పున అధికారం పంచుకునే ఒప్పందం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. మే 20, 2023 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య పదవీకాలం సగానికి చేరువవుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. కాగా, అలాంటి ఒప్పందం ఏదీ లేదని పునరుద్ఘాటిస్తూ, సిద్ధరామయ్య ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Ponguleti vs KTR | కేటీఆర్, హరీశ్‌రావుపై పొంగులేటి ఆగ్రహం

