Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

జాతీయం

Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 12:52 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Karnataka Social Media Ban
Karnataka Social Media Ban

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Social Media Ban | కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు అసెంబ్లీలోసీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రకటించారు.

Contents
  • Karnataka Social Media Ban | పిల్లలను రక్షించడం కోసం..
    • Karnataka Social Media Ban | గంటల కొద్ది..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ (Smart Phone) ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. చిన్నారులు అన్నం తినాలన్నా ఫోన్​లో వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టీనేజీ యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. దీంతో పలువురు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోన్​ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఆయన శుక్రవారం బడ్జెట్​ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సోషల్​ మీడియా బ్యాన్​పై ప్రకటన చేశారు.

Karnataka Social Media Ban | పిల్లలను రక్షించడం కోసం..

ఫోన్​ అధికంగా వాడటంతో యువ మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆందోళన నేపథ్యంలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతికూల ప్రభావాల నుండి పిల్లలను రక్షించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు సీఎం అన్నారు. డిజిటల్ పరధ్యానాలను తగ్గించడం, విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Karnataka Social Media Ban | గంటల కొద్ది..

ప్రస్తుతం పిల్లలు, విద్యార్థులు గంటల పాటు ఫోన్​తో గడుపుతున్నారు. వీడియోలు చూస్తూ టైపాస్​ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజీ పిల్లలు సోషల్​ మీడియాలో చాటింగ్​ల పేరిట మోసపోతున్నారు. బాలికలను కొందరు ప్రేమ పేరిట నమ్మించి మోసం చేస్తున్నారు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం పిల్లల ఏకాగ్రత, నిద్ర విధానాలు, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇది చదువులు, శారీరక శ్రమ, కుటుంబం, స్నేహితులతో గడిపే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం నిషేధం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి..: New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా

Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ .. రాజీనామా చేయనున్న సీఎం నితీశ్​?
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TAGGED:CM SiddaramaiahKarnataka GovernmentKarnataka Social Media BanSmart PhoneSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Divvela Madhuri Controversy Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
Next Article Hyderabad Bomb Threat Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?