Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం

తెలంగాణ

Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం

పాడి కౌశిక్​రెడ్డి సీనియర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్​ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 1:29 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Kaushik Reddy controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaushik Reddy controversy | బీఆర్​ఎస్ (BRS)​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Contents
  • Kaushik Reddy controversy | సస్పెండ్ చేయాలి
    • Kaushik Reddy controversy | దళితులంటే గౌరవం లేదు

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం పాడి కౌశిక్​రెడ్డి అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)ని  తుపాకీతో కాల్చి చంపుతానని కౌశిక్ రెడ్డి బెదిరించరంటూ కాంగ్రెస్​ సభ్యులు ఆరోపించారు. సీనియర్​ ఎమ్మెల్యేను వేలు చూపిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. కౌశిక్​రెడ్డి సభలో గూండాయిజం చేస్తున్నారని ఆరోపించార. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Kaushik Reddy controversy | సస్పెండ్ చేయాలి

తండ్రి లాంటి కడియం శ్రీహరికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారా అని కాంగ్రెస్​ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లపై చర్చ జరుగుతుంటే సభా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎంతో కొంత నేర్చుకుందామని సభకు వస్తే కొత్త ఎమ్మెల్యేలకు మీరిచ్చే సందేశం ఇదేనా అన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సభను స్పీకర్ ఆర్డర్​లో పెట్టాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి మనిషి పెరిగారు.. కానీ బుద్ది పెరగలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ సభ్యులు శ్రీహరికి సారి చెప్పాలని మందుల సామేల్​ డిమాండ్​ చేశారు.

Kaushik Reddy controversy | దళితులంటే గౌరవం లేదు

బీఆర్​ఎస్​ నేతలకు దళితులంటే గౌరవం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్ అన్నారు. కడియం శ్రీహరిపై వేలు చూపిస్తూ అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ఇంకా ఎన్నాళ్లు గూండాయిజం చేస్తారన్నారు. దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అవమానించిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్​ను కోరారు.

దీనిని కూడా చదవండి: Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!

Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
TAGGED:BRSCongressKadiyam SrihariPadi Kaushik Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nagi Reddy Pet Congress | Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం
Next Article CM Revanth Reddy CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?