అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha CBI Notice | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు (CBI Officers) వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆధారాలు లేవని చెప్పి ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తమ వాదనలు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. దీంతో వాటిని అందజేసేందుకు అధికారులు కవిత ఇంటికి వచ్చారు.

Kavitha CBI Notice | కోర్టు ఏం చెబుతుందో..
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ మంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కోర్టు కేసు కొట్టివేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపురితంగా తమపై కేసులు పెట్టి జైలు పాలు చేసిందని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష

