అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Clean Chit | ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జాగృతి రాష్ట్ర నాయకురాలు సూదం లక్ష్మి స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కవిత (Kalvakuntla Kavitha) కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే కేసు నమోదు చేశారనేది నిరూపితమైందని తెలిపారు. చివరకు నిజమే గెలిచిందన్నారు.
Kavitha Clean Chit | ఎంతో క్షోభ పెట్టారు..
రాజకీయ కుట్రలో భాగంగా కవితపై కేసు పెట్టి ఎంతో క్షోభకు గురిచేశారని సూదం లక్ష్మి అన్నారు. కేసులో ఐదున్నర నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చిందన్నారు. కానీ చివరకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడిందని పేర్కొన్నారు.
Kavitha Clean Chit | కవిత నాయకత్వంలో ముందుకెళ్తాం..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని సూదం లక్ష్మి తెలిపారు. త్వరలో కవిత స్థాపించనున్న పార్టీ రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు శాయశక్తులా పనిచేస్తామని చెప్పారు. కవిత నాయకత్వంలో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకురాలు కవిత అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

