Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

తెలంగాణ

Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 8:27 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kavitha Land Protest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Land Protest | రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆమె జాగృతి కార్యాలయంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.

Contents
  • Kavitha Land Protest | పరీక్షల సమయంలో..
    • Kavitha Land Protest | అక్రమంగా అరెస్ట్

భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని కవిత ప్రశ్నించారు. వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్లు కూల్చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూమి 30 ఎకరాలు ఉందని, ఆక్రమణకు గురైన మరో 30 ఎకరాల భూమి ఉందన్నారు.

Kavitha Land Protest | పరీక్షల సమయంలో..

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇళ్లను కూలగొట్టారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను అంబేడ్కర్​ భవన్​లో ఉంచారన్నారు. అక్కడ కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఎన్నో ఏళ్లు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే నిమిషాల్లో కూల్చేశారన్నారు. బాధితులకు భోజనం కూడా పెట్టడం లేదన్నారు.

Kavitha Land Protest | అక్రమంగా అరెస్ట్

బాధితులకు న్యాయం చేయాలని సోమవారం రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తుంటే ఇవాళ ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ధర్మ సమాజ్​ పార్టీ (DSP) అధ్యక్షుడు విశారదన్​ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదన్నారు. భూదాన్ బోర్డు పేదలకు ఇచ్చిన స్థలాలకు పట్టాలు కూడా ఇచ్చిందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కాని చోట నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు.

దీనిని కూడా చదవండి : Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు

KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
TAGGED:Bhoodan Lands TelanganaKalvakuntla KavithaKhammam Velugumatla IssueLand Demolition RowTelangana Jagruti Protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Student Death Investigation Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Next Article Prajapalana Pragathi Pranalika | Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?