Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన

నిజామాబాద్

Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన

పార్టీ ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 3:43 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Kavitha New Party

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha New Party | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్​లోని జాగృతి కార్యాలయం (Jagriti Office)లో ఆమె విలేకరులతో మాట్లాడారు.

Contents
  • Kavitha New Party | నిజామాబాద్​ కోడలిని..
    • Kavitha New Party | కొత్త పార్టీ అవసరం
      • Kavitha New Party | పోరాటాలు చేశాం
      • Kavitha New Party | తరలి రావాలి
      • నంబర్​ వన్​ పార్టీగా..

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఏప్రిల్​ 25న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉందన్నారు. మేడ్చల్​లో మునీరాబాద్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో పార్టీని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో, రాజకీయాల్లో మార్పు రావాలనుకున్న వారు రావాలని ఆహ్వానించారు. ఆ రోజు పార్టీ పేరు ప్రకటించి, జెండా ఎగురవేస్తామన్నారు. ఉదయం 8 గంటల్లోపు కార్యకర్తలు చేరుకోవాలని సూచించారు.

Kavitha New Party | నిజామాబాద్​ కోడలిని..

కవిత తెలంగాణ (Telangana) ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు తన ప్రజలను గుండె హత్తుకొని పాలన చేశారన్నారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి రోజు కొత్త పార్టీపై ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. తాను నిజామాబాద్​ కోడలిని అన్నారు. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచన అయినా విజయవంతం అవుతుందన్నారు.

Kavitha New Party

Kavitha New Party | కొత్త పార్టీ అవసరం

రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు సాధించుకోలేక పోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఆ పార్టీ అన్ని వర్గాల్లో వెలుగులు నింపాలన్నారు. ఆ లక్ష్యంతోనే తాము పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Kavitha New Party | పోరాటాలు చేశాం

తాను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కవిత తెలిపారు. రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామన్నారు. రాష్ట్రం వచ్చాక సైతం ప్రజల సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో డీఎస్​పీ పార్టీతో కలిసి నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేశామన్నారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి పట్టాలు ఇచ్చిందన్నారు.

Kavitha New Party | తరలి రావాలి

కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ పార్టీ పని చేస్తుందన్నారు.రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలన్నారు. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే తాము పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేసి వస్తామన్నారు. అనంతరం వచ్చే నెల 25న పార్టీ పేరు, అజెండా, జెండా ప్రకటిస్తామన్నారు. ఈ నెల రోజుల్లో పార్టీ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తామన్నారు.

నంబర్​ వన్​ పార్టీగా..

తాము ఎవరికి బీ పార్టీగా ఉండబోమని కవిత అన్నారు. నంబర్​ వన్​ పార్టీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్​లో అధికారంలోకి వస్తామన్నారు. రాముడిని ఆదర్శంగా తీసుకొని పని చేస్తామన్నారు. అన్నివర్గాలను కలుపుకొని వెళ్తామన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని పార్టీ ఏర్పాటు అనంతరం ప్రకటిస్తానన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ లేదన్నారు. తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీ అవుతందున్నారు. ఉద్యమకారుల అనుభవాలను తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి : Sita Rama Kalyanam | నర్సింగ్​పల్లి ఇందూరు తిరుమలలో కనుల పండుగగా సీతారామ కల్యాణం

School Early Admissions | ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
TAGGED:april 25 eventIndian PoliticsKalvakuntla KavithaKavitha New Partynew political party indiapolitical updatesTelangana newsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article PF Withdrawal App PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
Next Article Lockdown Rumors Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Sita Rama Kalyanam in Yellareddy | కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?