అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha New Party | తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీరామ నవమి (Sri Rama Navami) పర్వదినాన పార్టీని స్థాపించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న ఉదయం 8 గంటలకు కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Kavitha New Party | కొత్త పార్టీతో ప్రజల్లోకి..
బీఆర్ఎస్ (BRS) నుంచి బయటకు వచ్చిన కవిత రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. కాగా.. కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే.. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కవిత.. ప్రస్తుతం పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
Kavitha New Party | మెట్టినిల్లు నుంచే పార్టీ ప్రకటన..!
తన మెట్టినిల్లు నుంచే పార్టీ పేరు, జెండా, గుర్తు, విధివిధానాలను కవిత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఖిల్లా రామాయం (Nizamabad Khilla Ramalayam)లో పూజలు నిర్వహించిన అనంతరం పార్టీకి సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కవిత కొత్త పార్టీ స్థాపించనుండడం, శ్రీరామ నవమి రోజు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ జరుగుతోంది.
Kavitha New Party | బోధన్ నుంచే పోటీ..?
మార్చి 27న కవిత పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఆమె బోధన్ నుంచే పోటీ చేయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో మరో పార్టీ ఏర్పాటు కానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో కొంత కలవరం మొదలైనట్లుగా తెలుస్తోంది. కాగా.. తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిత.. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే.. ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు అభివృద్ధి అంశాలతో ఆమె ప్రజల్లోకి వెళ్తుందనే చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి..: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్

