అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha new party | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాగృతిలో భారీగా కార్యకర్తలు చేరుతున్నారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు అరుణ ఆధ్వర్యంలో కూకట్పల్లి (Kukatpalli)కి చెందిన పలువురు మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు. గాజులరామారం డివిజన్‌కు చెందిన పలువురు యువకులు జాగృతి నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి కవిత పార్టీలోకి ఆహ్వానించారు. జాగృతి క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు డేవిడ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్, ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్‌కు చెందిన యువకులు జాగృతిలో చేరారు.
Kavitha new party | రాజకీయ శక్తిగా వస్తున్నాం
మరో 20 రోజుల్లో కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని కవిత తెలిపారు. సింగరేణి (Singareni) సమస్యలపై ఆమె ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తాము తీర్మానం చేసిన అంశాలకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత బొగ్గు బాయిబాట పడుతామని హెచ్చరించారు. అదే విధంగా సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందన్నారు.
కవిత కొత్త పార్టీ (Kavitha new party) ఈ నెల 25న పెట్టనున్న విషయం తెలిసిందే. పార్టీలో టీఆర్ఎస్ పేరు ఉండేలా ఆమె చూస్తున్నట్లు సమాచారం. ఆ రోజు పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే జనంబాటతో కవిత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. పలు ప్రజా సమస్యలపై ఆందోళనలు చేశారు. పార్టీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆమె చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం.
దీనిని కూడా చదవండి : Sherylingampally | డ్రెయినేజీల్లో సీఎం ఫొటోలు పెట్టి నిరసన
