అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Nizamabad visit | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) శుక్రవారం నిజామాబాద్ రానున్నారు. నగరంలోని రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో ఆమె తన భర్తతో కలిసి పాల్గొంటారు. అనంతరం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు.
కవిత కొత్త పార్టీ (Kavitha New Party) పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీరామ నవమి సందర్భంగా తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ నుంచి పార్టీ పేరు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా కవిత కీలక ప్రకటన చేయనున్నారని జాగృతి వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ జాగృతి కార్యాలయం (Jagruthi Office)లో మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
Kavitha Nizamabad visit | రాములోరికి పట్టు వస్త్రాలు
ఖిల్లా రాంమందిర్‌లో జరిగే శ్రీరామ నవమి (Sri Ram Navami) వేడుకల్లో కవిత తన భర్త అనిల్‌తో కలిసి పాల్గొంటారు. వీరు సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని రామాలయాలకు కవిత దంపతులు ఏటా పట్టు వస్త్రాలు పంపిస్తారు. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత తరఫున ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు.
దీనిని కూడా చదవండి : SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

