అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kavitha Party Name Controversy | కొత్త పార్టీ తేదీని ప్రకటించే క్రమంలో ఎంపీ అర్వింద్‌పై (MP Arvind) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
Kavitha Party Name Controversy | నిజామాబాద్ వస్తేనే కోడలినని గుర్తొస్తుందా..?
ఎంపీ అర్వింద్‌పై కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ దంపల్లి జ్యోతి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ (Telangana) ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు.
Kavitha Party Name Controversy | మతిభ్రమించి మాట్లాడారు..
ఇందూరు జిల్లాలో (Induru District) ఎంపీ అర్వింద్ ధర్మపురి ఏకంగా పది ఆర్వోబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేయించారని జ్యోతి గుర్తు చేశారు. వాటిలో ఇప్పటికే మూడు పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇటీవల ఎంపీ సెంట్రల్ రైల్వే మినిస్టర్‌ను సైతం కలిసి ఇందల్వాయి, నవీపేట్ ఆర్వోబీలు కూడా మంజూరు చేయాలని కోరారన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కవితకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెచ్చింది పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కాదా అని ఆమె ప్రశ్నించారు. పసుపు రైతుల సంక్షేమానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.
Kavitha Party Name Controversy | ఎంపీగా ఉండి కవిత ఏం చేశారు..
కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని జ్యోతి డిమాండ్ చేశారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించారా ? ఆర్వోబీలు తెచ్చారా ? అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్‌లో వందలు, వేల కోట్లు కూడబెట్టింది వాస్తవం కాదా అని విమర్శించారు. మీ ఇంట్లోనే మీ తండ్రికి, మీ అన్నకు నీ మాటలంటేనే పట్టింపు లేదు, నువ్వు అర్వింద్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీఎం రేవంత్ (CM Revanth) ఉద్దీన్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావని కవితను ఉద్దేశించి జ్యోతి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 25న నువ్వు పెట్టబోయే కొత్త పార్టీకి “లిక్కర్ పార్టీ” అని పేరు పెట్టుకుంటే కరెక్టుగా సెట్ అవుతుందన్నారు. మీ తండ్రి సగం తెలంగాణను నాశనం చేస్తే, మిగిలిన తెలంగాణను కొత్త పార్టీ పేరుతో నువ్వు నాశనం చేయడానికి బయలుదేరావా అని విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నా రెడ్డి, కల్పె అర్చన, దాత్రికా రేవతి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Development Plans | ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పీసీసీ చీఫ్
