అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Siddipet Contest | తెలంగాణ రాజకీయాల్లో నయా చర్చకు దారి తీసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో Kalvakuntla Kavitha భవిష్యత్తులో Siddipet నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
Kavitha Siddipet Contest | వీడియోలో ఏముందంటే..
తన అమ్మగారి ఇల్లు సిద్ధిపేట అని, అత్తగారి ఇల్లు బోధన్ అని కవిత పేర్కొన్నారు. భవిష్యత్తులో సిద్ధిపేట నుంచి పోటీ చేయాలా.. లేక బోధన్ నుంచి పోటీలో ఉండాలా.. అనేది ఆలోచిస్తున్నట్లు కవిత చెప్పుకొచ్చారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా అన్నారు.
ఈ వీడియోకు మద్దతుగా నెటిజన్లు కవితను కొనియాడారు. కవిత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకురాలని రాసుకొచ్చారు. చిన్న చిన్న రాజకీయాల కోసం కాకుండా ప్రజా సమస్యలపై ఆమె నిరంతరం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న నాయకురాలిగా ఆమెను వర్ణించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా ఎదగగల సామర్థ్యం ఉన్న నేతగా కవితను కొనియాడారు.
అధికార, రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా కవిత వెనక్కి తగ్గే నాయకురాలు కాదని నెటిజన్లు కొనియాడారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని ఎవరూ అణిచివేయలేరని, ప్రజల ఆశయాల కోసం ఆమె పోరాటం కొనసాగుతుందని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోలో వ్యక్తమైన అభిప్రాయాలపై Telangana Jagruthi వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సిద్దిపేట నుంచి పోటీ చేసే అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా, ఈ వీడియో నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ కొనసాగుతోంది. రాజకీయంగా ఇది ఎంతవరకు వెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
https://www.instagram.com/reel/DVqMS7aEy78/?igsh=Mmt0ODlseTNhN2kx

