అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kavitha Sri Ram Navami | శ్రీరామ నవమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నిజామాబాద్ నగరంలోని రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Kavitha Sri Ram Navami | రాములవారికి పట్టు వస్త్రాల సమర్పణ..
ఖిల్లా రాంమందిర్‌లో శ్రీరామ నవమి (Sri Ram Navami) వేడుకల్లో కవిత తన భర్త అనిల్‌తో కలిసి పాల్గొన్నారు. వీరు సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని వివిధ రామాలయాలకు కవిత దంపతులు పట్టు వస్త్రాలు పంపించారు. బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడ్, జగిత్యాల ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత తరపున ప్రతినిధులు పట్టువస్త్రాలు అందజేశారు.
Kavitha Sri Ram Navami | పార్టీపై ప్రకటన చేయనున్నారా..?
కవిత తాజాగా కొత్తపార్టీ (Kavitha New Party) పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా తన మెట్టినిల్లయిన నిజామాబాద్ నుంచి పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా కవిత కీలక ప్రకటన చేయనున్నారని జాగృతి వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో (Jagruthi Office) మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Bar Elections | నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్ రెడ్డి

