Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి

తెలంగాణఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్ను మూశారు. హైదరాబాద్​లోని స్టార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 1:10 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kavuri Sambasiva Rao

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) కన్ను మూశారు. హైదరాబాద్ (Hyderabad)​లోని స్టార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు.

Contents
  • Kavuri Sambasiva Rao | కాంగ్రెస్​కు రాజీనామా
    • Kavuri Sambasiva Rao | కిషన్​రెడ్డి సంతాపం

సాంబశివరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​లోని ఏలూరు జన్మించిన ఆయన కాంగ్రెస్​ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా పని చేశారు.

Kavuri Sambasiva Rao | కాంగ్రెస్​కు రాజీనామా

సాంబశివరావు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్​ (Congress) నుంచి ప్రారంభించారు. సుదీర్ఘ కాలం ఆ పార్టీలో పని చేశారు. పార్టీకి సేవలు అందించడంతో కీలక పదవులు సైతం పొందారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. అనంతరం 2014లో బీజేపీలో చేరారు. కావూరు వ్యాపార రంగంలో కూడా ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Kavuri Sambasiva Rao

Kavuri Sambasiva Rao | కిషన్​రెడ్డి సంతాపం

కావూరు సాంబశివరావు మృతిపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Union Minister Kishan Reddy) సంతాపం తెలిపారు. ఎక్స్​ వేదికంగా ఆయన స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు పెట్టారు. 5 సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రాజకీయంలో సాంబశివరావుకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై తన గళాన్ని వినిపించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత

Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
TAGGED:Andhra PradeshCongressHyderabadKavuri Sambasiva RaoUnion Minister Kishan Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shiv Pratap Shukla Governor Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Next Article Kadiyam Srihari Challenge Kadiyam Srihari Challenge | కేసీఆర్​ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?