Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KBR Park Traffic | కేబీఆర్​ పార్క్​ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KBR Park Traffic | కేబీఆర్​ పార్క్​ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు

తెలంగాణ

KBR Park Traffic | కేబీఆర్​ పార్క్​ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్​ పార్క్​ చుట్టూ ఆదివారం పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 3:57 సా.
Srinivas Kolluri
18 గంటలు ago
Share
KBR Park Traffic

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KBR Park Traffic | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేబీఆర్​ పార్క్​ చుట్టూ ఆదివారం పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వన్​వే అమలు చేశారు.

జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టీల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్ నిర్మాణం చేపడుతోంది. పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా మళ్లింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వకుండా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వేను అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

KBR Park Traffic | ప్రయోగాత్మకంగా..

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వన్​ వే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఒకటే మార్గంలో వాహనాలను అనుమతించారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్‌ వైపు వెళ్లే వాహనాలను బంజరాహిల్స్​ రోడ్డు నంబర్‌ 2 నుంచి వన్‌వేగా మళ్లించారు. టీవీ9 ఆఫీసు నుంచి వచ్చే వాహనాలను కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఎడమ వైపునకు డైవర్ట్​ చేశారు. ఈ రోజు చేపట్టిన ట్రయల్​ రన్​ విజయవంతం అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో తలెత్తిన ఇబ్బందులను విశ్లేషించిన అనంతరం చర్యలు చేపట్టనున్నారు.

వన్‌ వే విధానాన్ని సీపీ సజ్జనార్​ (CP Sajjanar) పరిశీలించారు. కేబీఆర్ పార్క్ (KBR Park Traffic ) మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.

 

కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన వన్‌ వే విధానాన్ని ఈ రోజు పరిశీలించాను.

కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాల రాకపోకలను… pic.twitter.com/lkqcVxoVRm

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 5, 2026

దీనిని కూడా చదవండి : Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం

SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం
Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి
Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
heavy rain alert | రైతులకు అలెర్ట్​.. మళ్లీ భారీ వర్ష సూచన
TAGGED:City TrafficHyderabad trafficJubilee HillsKBR Park TrafficOne Way Ruleroad diversionsTraffic Restrictions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Military Aircraft Crash US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!
Next Article Handcuffs Handcuffs | పోలీస్​ స్టేషన్​కు గేటుకు బేడీలు.. ఏపీలో విచిత్ర ఘటన..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?