Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!

తెలంగాణతాజా వార్తలు

KCR Political Strategy | బీఆర్​ఎస్​లోకి జీవన్​రెడ్డి.. కేసీఆర్​ వ్యూహం అదేనా!

మాజీ మంత్రి జీవన్​రెడ్డి త్వరలో బీఆర్​ఎస్​లో చేరనున్నారు. కాంగ్రెస్​లో అసంతృప్తితో ఉన్న సీనియర్లను తమ పార్టీలోకి తీసుకోవాలని గులాబీ బాస్​ యోచిస్తున్నట్లు సమాచారం.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 11:47 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
KCR Political Strategy

అక్షరటుడే, వెబ్​డెస్క్: KCR Political Strategy | మాజీ మంత్రి, కాంగ్రెస్​లో 4 దశాబ్దాలు సేవలు అందించిన జీవన్​రెడ్డి త్వరలో బీఆర్​ఎస్​లో చేరనున్నారు.

Contents
  • KCR Political Strategy | సీనియర్ల గుర్రు
    • KCR Political Strategy | గతంలో రేవంత్​రెడ్డి సైతం..

జగిత్యాలకు చెందిన జీవన్​రెడ్డి పదేళ్ల బీఆర్​ఎస్​ (BRS) హయాంలో సైతం కాంగ్రెస్​ను వీడకుండా.. పార్టీ కోసం పని చేశారు. తాజాగా అలాంటి నేత తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే జీవన్​రెడ్డి (Jeevan Reddy) అంశంలో బీఆర్​ఎస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) స్వయంగా జీవన్​రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆయనను లంచ్​కు రావాలని కేటీఆర్​ ఆహ్వానం పంపారు. శుక్రవారం మధ్యాహ్నం మాజీ సీఎం జగిత్యాల నేతతో సమావేశం కానున్నారు. జీవన్​రెడ్డి చేరిక విషయంలో బీఆర్​ఎస్​ వేస్తున్న అడుగులు కీలకంగా మారాయి. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేగాకుండా ఆయన చేరిక ద్వారా కాంగ్రెస్​లో అసంతృప్తులకు సైతం గాలం వేయాలని బీఆర్​ఎస్​ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ విషయంలో కేసీఆర్​, కేటీఆర్​ స్వయంగా చొరవ చూపుతున్నారని తెలిసింది.

KCR Political Strategy | సీనియర్ల గుర్రు

కాంగ్రెస్​లో పలువురు సీనియర్​ నాయకులు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రాజ్యసభ ఎంపీ సీటు విషయంలో కూడా సీనియర్లను కాదని సీఎం తన సన్నిహితుడైన వేం నరేందర్​రెడ్డికి కేటాయించారు. దీనిపై పలువురు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని బీఆర్​ఎస్​ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరిత మంచి అవకాశం ఇస్తామని చెప్పడానికే జీవన్​ రెడ్డి విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

KCR Political Strategy | గతంలో రేవంత్​రెడ్డి సైతం..

బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్​ (KCR) పక్కన పెట్టిన నేతలను రేవంత్​రెడ్డి ఏకం చేశారు. వాళ్లతో కలిసి కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తెచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలను కలుపుకొని వెళ్లి అధికారం దక్కించుకున్నారు. బీఆర్​ఎస్​ సైతం ఇదే ఫార్మూలా అప్లై చేయాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రేవంత్​రెడ్డి పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఆ పార్టీలోని సీనియర్లు తమ వైపు వస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీఆర్​ఎస్​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Drug Tests | రౌడీ షీటర్లకు డ్రగ్​ టెస్ట్​లు.. 190 మందికి పాజిటివ్​

Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
TAGGED:BRSCM Revanth ReddyCongress leaders shiftJeevan ReddyJeevan Reddy newsKCR Political StrategyKTRKTR role politicsRevanth Reddy governmentTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Royal Enfield Flying Flea C6 Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్..
Next Article US Iran Talks US Iran Talks | పశ్చిమాసియాలో యుద్ధం ముగిసేనా?.. నేటి నుంచి అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?