అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala Techie Missing Case | కర్ణాటక (Karnataka) దట్టమైన అడవుల్లో చోటుచేసుకున్న ఓ ఉత్కంఠభరిత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
జి.ఎస్. శరణ్య అనే 36 ఏళ్ల మహిళ, ప్రాణాపాయ పరిస్థితుల్లో నాలుగు రాత్రులు ఒంటరిగా గడిపి, చివరకు సురక్షితంగా బయటపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొడగు జిల్లా (Kodagu District) కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతం… చుట్టూ ఏనుగుల సంచారం… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం (Heavy Rain)… చేతిలో కేవలం అర లీటర్ నీరు మాత్రమే… ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆశలు వదిలేసే పరిస్థితి. కానీ శరణ్య మాత్రం అసాధారణ ధైర్యంతో నిలబడి, మృత్యువునే జయించింది.
Kerala Techie Missing Case | ట్రెక్కింగ్‌లో తప్పిపోయిన శరణ్య
టేడియాండమోల్ శిఖరాన్ని (Tediandamol Peak) అధిరోహించేందుకు ఏప్రిల్ 2న శరణ్య 10 మంది సభ్యులతో కలిసి ట్రెక్కింగ్‌కు బయలుదేరారు. ఉదయం బేస్ క్యాంప్ చేరుకున్న ఆమె, తిరుగు ప్రయాణంలో దారి తప్పిపోయారు.మొబైల్ సిగ్నల్ లేకపోవడం, కొద్దిసేపటికే ఫోన్ బ్యాటరీ అయిపోవడం వల్ల ఎవరితోనూ సంప్రదించలేకపోయారు. చేతిలో ఉన్న చిన్న నీళ్ల బాటిల్ తప్ప మరే సరఫరా లేకుండా అడవిలోనే చిక్కుకుపోయారు. శరణ్య తన అనుభవాన్ని వివరిస్తూ.. మొదటి రోజు సాయంత్రం వరకు నడిచాను. దారి కనిపించకపోవడంతో ఒక వాగు పక్కన ఆగిపోయాను. ప్రతిరోజూ ఎవరో కనిపిస్తారనే ఆశతో నడుస్తూనే ఉన్నాను. ఆశ్చర్యంగా నాకు భయం అనిపించలేదు” అని తెలిపారు.
Kerala Techie Missing Case | ఏనుగుల సంచారం, భారీ వర్షం
ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతం, భారీ వర్షం, ఆహారం లేకపోవడం ప్రమాదకర పరిస్థితులే అయినప్పటికీ, ఆమె మానసిక ధైర్యం కోల్పోలేదు. ఇదే ఆమె ప్రాణాలను కాపాడిన ప్రధాన కారణంగా భావిస్తున్నారు. శరణ్య కనిపించకపోవడంతో, సిద్ధరామయ్య ఆదేశాల మేరకు భారీ గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, అటవీ శాఖ అధికారులు, యాంటీ నక్సల్ స్క్వాడ్ (Anti-Naxal Squad), స్థానిక గిరిజనులు కలిసి అడవిని జల్లెడ పట్టారు. థర్మల్ డ్రోన్ కెమెరాల (Thermal Drone Cameras) సహాయంతో కూడా విస్తృతంగా గాలింపు కొనసాగించారు. చివరికి ఎవరూ వెళ్లని ఓ మారుమూల ప్రాంతంలో స్థానికులు శరణ్యను గుర్తించి రక్షించారు. నాలుగు రోజుల పాటు ఆహారం, సరైన నీరు లేకుండా ఉన్నప్పటికీ, ఆమె చిరునవ్వుతో బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈశ్వర్ ఖండ్రే శరణ్యను “సాహసవంతురాలు”గా కొనియాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరలోనే స్వగృహానికి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో పని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
