అక్షరటుడే, బోధన్: KGBV School Inspection | నవీపేటలోని మోకన్‌పల్లి కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi Girls School) బాలికల పాఠశాల నిర్వహణ తీరుపై (KGBV School Inspection) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
KGBV School Inspection | ఇన్‌ఛార్జి స్పెషల్ ఆఫీసర్, మరొకరికి..
మోకన్పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Navipet News) కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను (Bodhan Education News) తనిఖీ చేశారు. నిర్వహణపరమైన లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత వ్యక్తులపై (School Administration) ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్‌ఛార్జి స్పెషల్ ఆఫీసర్ కవితతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీ రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
KGBV School Inspection | విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోం..
బాలికల విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థినుల భద్రతకు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదన్నారు. అనంతరం 10వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించి (Girls Education India), పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. విద్యార్థినుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను కలెక్టర్ పరిశీలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ గురించి బాలికలకు వైద్యులు చక్కగా అవగాహన కల్పించడం పట్ల వారిని కలెక్టర్ అభినందించారు. కాగా, కేజీబీవీ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి

