అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khamenei Death Claims | ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei హతమైనట్లుగా సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఖమేనీ మరణాన్ని స్పష్టంగా ధ్రువీకరించలేదు. కానీ, , “ఆయన ఇక లేరనే సంకేతాలు ఉన్నాయి..” అని నెతన్యాహు వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
Khamenei Death Claims | యూఎస్‌తో కలిసి..
అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ Israel నిర్వహించిన దాడుల ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుందని నెతన్యాహు సంకేతాలిచ్చారు. దీనికితోడు ఇరాన్ ప్రజలు “వీధుల్లోకి వచ్చి పని పూర్తి చేయాలి” అంటూ బెంజిమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు.
Khamenei Death Claims | ధ్రువీకరించని యూఎస్
కాగా, ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తెహ్రాన్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత విషమంగా మార్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ శాంతి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆ తర్వాత ఖమేనీ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటన విడుదల చేశారు. ఖమేనీ హతమైనట్లు ప్రకటిచారు. ఇదే విషయాన్ని కొద్ది సేపటికి ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.
Khamenei Death Claims | ఘర్షణలు ముదురుతాయా..
ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సమయంలో ప్రాంతీయ స్థాయిలో ఘర్షణలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నెతన్యాహుతోపాటు, ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత రానుంది.

